1 John 3

1మనం దేవుని పిల్లలం అని పిలిపించుకోవాలని తండ్రి మనల్ని ఎలా ప్రేమించాడో చూడండి! మనం దేవుని పిల్లలమే. అ కారణం చేత లోకం మనల్ని గుర్తించదు, ఎందుకంటే అది దేవుణ్ణి ఎరగదు. 2ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలం. ఇకముందు మనం ఎలా ఉండబోతున్నామో మనకు ఇంకా వెల్లడి కాలేదు. కాని క్రీస్తు ప్రత్యక్షం అయినప్పుడు మనం ఆయనను ఉన్నవాడు ఉన్నట్టుగానే చూస్తామనీ ఆయన వలె ఉంటామనీ మనకు తెలుసు. 3ఆయన మీద ఇలాంటి ఆశాభావం నిలిపినవారందరూ, ఆయన పవిత్రుడై ఉన్న విధంగా తనను తానూ పవిత్రం చేసుకుంటాడు.

4పాపం చేసే ప్రతివాడూ అక్రమంగా ప్రవర్తిస్తున్నాడు. పాపమంటే అక్రమమే. 5మన పాపాలు తీసివేయడానికి క్రీస్తు మన కోసం వచ్చాడు. ఆయనలో ఏ పాపమూ లేదు. 6ఆయనలో నిలిచి ఉన్నవారెవరూ పాపం చేస్తూ ఉండరు. పాపం చేస్తూ ఉన్నవాడు, ఆయన ఎవరో తెలుసుకోలేదు, ఆయన్ని ఎన్నడూ చూడలేదు.

7పిల్లలూ, మిమ్మల్ని ఎవ్వరూ తప్పు దారి పట్టించకుండా జాగ్రత్త పడండి. క్రీస్తు నీతిమంతుడై ఉన్నట్టుగా, నీతిని జరిగించేవాడు నీతిమంతుడు. 8పాపం చేసేవాడు సైతాను సంబంధి. ఎందుకంటే ఆరంభం నుండీ సైతాను పాపం చేస్తూనే ఉన్నాడు. సైతాను పనులను నాశనం చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్ష్యం అయ్యాడు.

9దేవుని ద్వారా జన్మించినవాడు పాపం చెయ్యడు. దేవుని ద్వారా జన్మించినవానిలో దేవుని విత్తనం ఉంటుంది కాబట్టి అతను పాపం చెయ్యలేడు. 10నీతిని జరిగించనివాళ్ళు దేవుని పిల్లలు కాదు. తమ సోదరుణ్ణి ప్రేమించనివాళ్ళు దేవుని పిల్లలు కాదు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో, సైతాను పిల్లలెవరో తెలిసిపోతుంది.

చిన్నపిల్లలు కలిసి నివసించాలి

11మనం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలన్న సందేశం మీరు ఆరంభం నుండి వింటూనే ఉన్నారు. 12సైతాను సంబంధి అయిన కయీను తన తమ్ముణ్ణి చంపాడు. మీరు అతనిలా ఉండవద్దు. కయీను తన తమ్ముణ్ణి ఎందుకు చంపాడు? అతని క్రియలు దుర్మార్గమైనవి. అతని తమ్ముని క్రియలు నీతిగలవి.

13నా సోదరులారా, ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి. 14మనం మన సోదరుల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి మనం మరణంలో నుండి జీవం లోకి దాటిపోయామని మనకు తెలుసు. ప్రేమించనివాడు మరణంలోనే ఉండిపోతాడు. 15తన సోదరుణ్ణి ద్వేషించే ప్రతివాడూ హంతకుడే. ఏ హంతకునిలోనూ శాశ్వత జీవం లేదని మీకు తెలుసు.

16యేసు క్రీస్తు మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ప్రేమంటే ఇదే. మనం కూడా మన సోదరుల కోసం మన ప్రాణాన్ని అర్పించాలి. 17ఈ లోకంలో అన్నీ ఉన్నవాడు, అవసరంలో ఉన్న తన సోదరుణ్ణి చూసి, అతనిపట్ల కనికరం చూపకపోతే, దేవుని ప్రేమ అతనిలో ఎలా ఉంటుంది? 18పిల్లలూ, నాలుకతో మాటలతో ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు, క్రియలతో సత్యంతో ప్రేమిద్దాం.

19దీనివల్ల మనం సత్య సంబంధులమని తెలుస్తుంది. అప్పుడు మన హృదయాలు ఆయన ముందు స్థిరంగా ఉంటాయి. 20మన హృదయం మనమీద నింద మోపితే, దేవుడు మన హృదయం కన్నా గొప్పవాడు, ఆయనకు అన్నీ తెలుసు. 21ప్రియులారా, మన హృదయం మనమీద నింద మోపకపోతే, దేవుని దగ్గర ధైర్యంగా ఉంటాం. 22అప్పుడు, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ ఉండడంవల్ల, మనం ఏది అడిగినా, అది ఆయన దగ్గరనుండి పొందుతాం.

23ఇదే ఆయన ఆజ్ఞ: ఆయన కుమారుడు యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. దేవుని ఆజ్ఞలు పాటించినవాడు ఆయనలో నిలిచి ఉంటాడు. దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు. ఆయన మనకిచ్చిన ఆత్మ ద్వారా ఆయన మనలో నిలిచి ఉన్నాడని మనకు తెలుసు.

24

Copyright information for TelULB